ప్రాణం తీసిన టిక్‌టాక్‌ వీడియో

TikTok app
TikTok app

మేడ్చల్‌: టిక్‌టాక్‌ వీడియో యువకుడి ప్రాణం తీసింది. సంఘారెడ్డిలో నివసించే నరసింహ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, దూలపల్లి గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వచ్చాడు. దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్లాడు. బంధువు ప్రశాంత్ టిక్ టాక్ వీడియో రికార్డు చేస్తుంటే నరసింహ డ్యాన్స్ చేశాడు. అలా రెండు మూడుసార్లు టిక్ టాక్ పాటలు రికార్డు చేసిన తర్వాత మరింత లోతుకు వెళ్లడం కోసం నరసింహ ప్రయత్నించాడు. అక్కడ లోతుగా ఉన్న కుంటలోకి జారిపోయాడు. దీంతో భయపడ్డ ప్రశాంత్ చుట్టుప్రక్కల వాళ్లకు సమాచారం ఇచ్చాడు. కుంట లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో దిగేందుకు స్థానికులు భయపడ్డారు. ఈరోజు ఉదయం పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి నరసింహ మృత దేహాన్ని వెలికి తీశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/