మహారాష్ట్రలో తెలంగాణ విద్యార్థుల గల్లంతు

వాటర్‌ ఫాల్స్‌లో ఇద్దరి మృతి

Three students drown in waterfall
Three students drown in waterfall

త్రయంబకేశ్వర్‌: మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌ ప్రాంతంలో తెలంగాణకు చెందిన విద్యార్థులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఔరంగాబాద్‌లోని అగ్రికల్చర్‌ వర్సిటీలో చదువుతున్న కొంతమంది విద్యార్థులు త్రయంబకేశ్వర్‌లోని దుగర్‌వాడి వాటర్‌ ఫాల్స్‌ చూడానిని వెళ్లారు. అందులో రఘువంశీ(21), కోటిరెడ్డి(20), గిరిధర్‌ ఆకాశ్‌(20), వెంకటేశ్వర్‌ రెడ్డి(20), కావ్య(20), అనూష(21) ఉన్నారు. స్నేహితులు వారించినా వినకుండా అనూష, కోటిరెడ్డి, రఘవంశీ నీటిలోకి దిగారు. కొంతదూరం వెళ్లాక వీరు గల్లంతయ్యారు, ఎంతకీ కనిపించకపోవడంతో వారిని వెతుక్కుంటూ వెళ్లిన స్నేహితులకు అనూష మృతదేహం కనిపించింది. దీంతో స్థానికుల సహాయం కోరడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఈ రోజు ఉదయం మరో మృతదేహం లభ్యమయింది. కాగా మరో వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/