ఏసిబికి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

హైదరాబాద్‌లో ఇద్దరు.. వరంగల్‌లో ఒకరు

Three employees in ACB trap
Three employees in ACB trap

హైదరాబాద్‌: తెలంగాణలో ఒకే రోజు లంచం తీసుకుంటూ ముగ్గురు రెవెన్యూ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. గండిమైసమ్మ దుండిగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ గా పనిచేస్తున్న వై. నరేందర్‌ రెడ్డి ఓ రైతు భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రూ.40 వేలు లంచం అడిగాడు. అడిగిన మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసిబికి చిక్కాడు. గతంలో కూడా నరేందర్‌రెడ్డి పై కులధ్రువీకరణ పత్రం విషయంలో కేసు నమోదైంది ఈ కేసులో ఇటీవలే జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా తన వక్ర బుద్ధి మార్చుకోలేదు, దాంతో మరోసారి ఏసిబి వలకు చిక్కాడు. నాచారంలోని సర్కిల్‌-2 ఉప వాణిజ్య పన్నుల అధికారిణి ధీరావత్‌ సరోజను, మౌలాలికి చెందిన గ్యార రాజకుమార్‌ అనే వ్యక్తి జిఎస్‌టి లోని తన చిరునామాను మార్చేందుకు బేరం కుదుర్చుకున్నాడు. రూ. 5వేలు డిమాండ్‌ చేయగా, లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయింది.
వరంగల్‌ జిల్లా రాయపర్తిలో మరోవ్యక్తి రూ. 7500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పునకు ఓ రైతు నుంచి పై మొత్తంలో కొండూర్‌ ఇంఛార్జ్‌ గ్రామ రెవెన్యూ అధికారి(విఆర్‌ఓ) డిమాండ్‌ చేశాడు. రూ. 10వేలు అడగగా రూ.7500లకు ఒప్పందం కుదిరింది. కాగా ఈ మొత్తం తీసుకుంటుండగా అధికారుల చేతికి చిక్కాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/