విదేశాల నుంచి వచ్చిన వాళ్లు సహకరించాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

TS CM KCR

Hyderabad: విదేశాల నుంచి వచ్చిన వాళ్లు సహకరించాలని, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చెప్పినట్లు వినాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

మీ అంతట మీరే ఎక్కడి నుంచి వచ్చారో రిపోర్ట్‌ చేయాలన్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

అరెస్ట్‌ చెయ్యరని, లక్షణాలు ఉంటేనే చికిత్స ఇస్తారన్నారని పేర్కొన్నారు. మీ కుటుంబాన్ని, సమాజాన్ని ఇబ్బంది పెట్టొద్దన్నారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఉంటే చెప్పాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో జబ్బుకు కారణం విదేశీ ప్రయాణాలేనన్నారు. చికిత్సకు మీకు రూపాయి ఖర్చు ఉండదు.. ప్రభుత్వమే అన్ని సేవలు చేస్తుందన్నారు.

మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు కూడా వినియోగించుకోవచ్చన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/