మూడవ ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ కేటాయించాలని కెటిఆర్‌ లేఖ

K. T. Rama Rao
K. T. Rama Rao

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపాలిటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్‌లో మూడవ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ను కేటాయించాలని కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటి, లా కమ్యూనికేషన్స్‌ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో శరవేగంగా పురోగతి సాధిస్తోందని గురువారం కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కెటిఆర్‌ పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లు తెలంగాణలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఐటి సాప్ట్‌వేర్‌ రంగం ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ఐటి రంగంలో 60 వేల నూతన ఉద్యోగాలు, వేలాది ఉపాధి అవకాశాలు కల్పించి చరిత్ర సృష్టించిందని కెటిఆర్‌ పేర్కొన్నారు. సుమారు రూ.5వేల కోట్ల పెట్టుబడులను ఆకర్శించిందని కేంద్రమంత్రికి లేఖలో కెటిఆర్‌ వివరించారు. తెలంగాణ ఎలక్ట్రానిక్‌ విధానాలు దేశంలోనే గొప్పవిగా ఉన్నాయనీ, వివిధ వర్గాలు, సంస్థలకు మూలధన రాయితీని, రవాణా రాయితీని, డార్మెటరీ పాలసీని అందిస్తోందని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/