క్వారంటైన్ నుండి తప్పించుకున్న యువకుడు

అదుపులోకి తీసుకున్న పోలీసులు

hand cups
hand cups

హైదరాబాద్; ఇటీవలే దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన ఓ యువకుడికి ముంబై అధికారులు అతడి చేతిపై క్వారంటైన్ స్టాంప్ వేసి, యువకుడిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే అక్కడి నుండి తప్పించుకున్న యువకుడు హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్ నుండి పశ్చిమ గోదావరి వెళుతున్న సమయంలో బస్సులో అతడి చేతిపై ఉన్న స్టాంపు ను చుసిన తోటి ప్రయాణికులు వెంటనే బస్సు ను ఆపి పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. దింతో అక్కడికి చేరుకున్న ఎల్ బి నగర్ పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి;https://www.vaartha.com/news/national/