కరోనా ఎఫెక్ట్‌..పోలీసులు అదుపులోకి విదేశీయులు

వైరస్‌ వ్యాప్తికి విదేశీయులు కారణమనుకుంటున్న ప్రభుత్వం

police
police

హైదరాబాద్‌: దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్‌మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తుంది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం అందుకు గల కారణాలను విశ్లేశించగా, తెలంగాణలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా విదేశీ ప్రయాణికుల ద్వారా విస్తరిస్తుందని గ్రహించిన ప్రభుత్వం వారిపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఎక్కడ విదేశియులు కనిపించిన అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నల్గోండ జిల్లాలో పరటిస్తున్న 14 మంది విదేశియులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. వీరి రక్త పరీక్షలు పరీక్షించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కాబట్టి ఎక్కడైనా విదేశియులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/