గాంధీభవన్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

అనుమతించకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామన్న కాంగ్రెస్‌

Gandhibhavan
Gandhibhavan

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో నేడు నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి పోలీసులు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూడా ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్‌ యోచిస్తుండడంతో గాంధీ భవన్‌ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. మరోవైపు పోలీసుల అనుమతి లభించినా, లభించకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా గాంధీభవన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్‌లో పార్టీ జెండా ఎగురవేసి అనంతరం ర్యాలీని చేపడతారు. కాగా ఈ ర్యాలీకి హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. అయితే ఈ ర్యాలీకీ కార్యకర్తలు కూడా హైదరాబాద్‌కు తరలివస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/