దిశ నిందితుల కస్టడీ పిటిషన్‌ విచారణ రేపటికి వాయిదా

Disha incident victims
Disha incident victims

షాద్‌ నగర్‌: దిశ హత్యోదంతంపై యావత్తు దేశం భగ్గుమంటుంది. శంషాబాద్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు షాద్‌ నగర్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిందితులకు 10 రోజుల కస్టడీ ఇవ్వాలని, ఈ కేసులో మరింత నిశితంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని షాద్‌ నగర్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రస్తుతం నిందితులు ఉన్న చర్లపల్లి జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అధికారులు చేశారు. అయినప్పటికీ ఇతర ఖైదీలు దాడి చేసే అవకాశం ఉందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. కాగా నిందితులక ప్రత్యేకంగా హై సెక్యూరిటీ సింగిల్‌ బ్యారక్‌ లను కేటాయించిన సంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/