భార్యను చంపిన భర్త

విభేదాలే ప్రధాన కారణం

Man killed her wife
Man killed her wife

హైదరాబాద్‌: భార్యతో విభేదించిన ఓ భర్త ఆమెను కడతేర్చాడు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల గోపన్‌పల్లి ఎన్టీఆర్‌ నగర్‌లో ఈ సంఘటన జరిగింది. అనంతప్ప అనే వ్యక్తి హనుమాన్‌ భక్తుడు, అతని భార్య అమ్మవారి భక్తురాలు. అయితే భార్య మహదేవమ్మతో పూజల విషయంలో తరచూ విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన అనంతప్ప అతని భార్యకు ఉరి వేసి చంపాడు, అంతేకాకుండా వాళ్ల 18 నెలల కొడుకుని కూడా ఊపిరాడకుండా చేసి అంతమెందిచాడు. వాళ్లిద్దరూ మరణించిన అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/