పేదల సొంతింటి కలను నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడి

TS Minister Srinivas Goud
TS Minister Srinivas Goud

Mehaboob nagar: పేదల సొంతింటి కలను నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కొండూర్గ్‌ మండలం వీరన్నపేట లో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్దిదారులను ఆయన లాటరీ ద్వారా  ఎంపిక చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ.. వీరన్నపేటలో 650 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. 

 మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌ రేపు పర్యటించనున్నారనీ, ఆ సందర్భంగా  ఈ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభిస్తారని తెలిపారు.

వీరన్నపేట్‌లో ఇళ్లు లేని 100 మంది ఎస్సీలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/