భక్తులతో కిక్కిరిసిపోయిన మేడారం

Sammakka Saralamma Jatara, medaram
Sammakka Saralamma Jatara, medaram

మేడారం: వరంగల్‌లోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తుల పెద్ద ఎత్తున్న తరలివస్తున్నారు. సమీపంలో గల జంపన్న వాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వనదేవతలు సమ్మక్క.. సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం కావడంతో పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, తదితర ప్రాంతాలనుంచి భక్తులు అశేషంగా తరలివస్తున్నారు. ఈ కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జాతర నిర్వహించనున్నారు. అయితే జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశ్యంతో భక్తులు ముందుగానే తరలివస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి ములుగు జిల్లా మేడారం చేరుకున్నారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/