దేశంలో బిజెపి హవా కొనసాగుతుంది

K. Laxman
K. Laxman

సిద్దిపేట: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బిజెపి కార్యలయానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. త్వరలోనే అన్ని జిల్లాలో పార్టీ కార్యలయాలకు భూమిపూజా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలో బిజెపి హవా కొనసాగుతుందని, అయోధ్య రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పుతో దేశంలోని అన్ని వర్గాలు, మతాలు, పార్టీలు సంతృప్తి వ్యక్తం చేసాయని పేర్కొన్నారు. కేవలం ఆరేళ్ల వ్యవధిలో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కిందని కొనియాడారు. కేంద్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా అభివృద్ధి సాధించలేకపోయాయని విమర్శించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 అయోధ్య వంటి దీర్ఘకాల సమస్యలను మోడీ ప్రభుత్వం అవలీలగా పరిష్కరించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..ఆర్టీసి కార్మికుల విషయంలో కెసిఆర్‌ తీసుకునే నిర్ణయాలతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలంగాణలో కూడా బిజెపి జెండా ఎగురుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/