మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చు

B. Vinod Kumar
B. Vinod Kumar

తెలంగాణ (బోయినపలి)్ల: మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలశయంతో పూర్వపు కరీంనగర్‌ జిల్లా వాటర్‌ హబ్‌గా మారనున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని చొప్పదండి ఎమ్మెల్యె సుంకె రవిశంఖర్‌, ఐడీసీ చైర్మెన్‌ ఈద శంకర్‌ రెడ్డి, సుడా చైర్మెన్‌ రామకృష్ణారావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి సందర్శించారు. జలాశయంలోని గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోగం ఒర్రె ప్రాంతంలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఏ కొత్త ప్రాజెక్టు పూర్తి అయిన నీటిని దశలవారీగా నింపి పరీక్షించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాలుగా 6 టీఎంసీల నీటిని నింపామన్నారు. దిగువ మానేరు డ్యాం మధ్య మానేరు జలాశయంలతో ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయవచ్చునని వినోద్‌ కుమార్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మధ్య మానేరు జలాశయం జల కూడలిగా అవతరించిందన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/