తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలు

ssc exams
ssc exams

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా లాక్‌డైన్‌ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. జూన్ 8న ఇంగ్లీష్ పేపర్, 11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2, 20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2, 26న సోషల్ స్టడీష్ పేపర్ 1, 29న సోషల్ స్టడీష్ పేపర్ 2 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌) జులై 5న ఒకేషనల్‌ కోర్సు(థియరీ) పరీక్షలను నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గ్యాప్ ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యార్థులెవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వారికి ప్రత్యేక గదులను కేటాయించనున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2500 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/