నల్గొండలో ఎమ్మెల్సీ పోలింగ్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత

congress, TRS
congress, TRS

నల్గొండ: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్‌ కొనసాగుతుంది. ఈ సందర్భంగా నల్గొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులు పోటీపోటీగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ ప్రారంభం ఐన తర్వాత భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులతో నల్గొండ క్లాక్‌టవర్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు నేతలు ఎదురుపడటంతో వారి అనుచరులు పరస్పరం నినాదాలు ఉధృతం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపు చేశారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/