తెలుగు రాష్ట్రాల సిఎంల సమావేశం

ప్రగతి భవన్‌ల్లో జగన్‌కు స్వాగతం పలికిన కెసిఆర్‌

cm jagan-cm kcr
cm jagan-cm kcr

హైదరాబాద్‌: ఏపి సిఎం జగన్‌ హైదరాబాద్‌లోని సిఎం కెసిఆర్‌ అధికార నివాసం ప్రగతి భవనకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు కెసిఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం వారిరువురూ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలతో పాటు నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించనున్నట్లు తెలిసింది. వీటితో పాటు విభజన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పలు విషయాలపై వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో మూడు రాజధానుల అంశం వారిద్దరి మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలపై చర్చించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/