తెలంగాణకు, తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం

TS TDP President Ramana

Hyderabad: తెలంగాణ ప్రాంత అభివృద్దిలో తెదేపాది కీలకపాత్ర అని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు తెదేపా అభ్యర్థిగా కిరణ్మయికి బి-ఫామ్ అందించిన సందర్భంగా రమణ మాట్లాడుతూ…. పార్టీ కార్యక్రమాల్లో కిరణ్మయి చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. తెదేపా చర్యల వల్లే హైదరాబాద్, ఐటీ అభివృద్ది చెందిందన్నారు. తెలంగాణకు, తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/