తెలంగాణ ఆర్‌టిసిలో సమ్మె సైరన్

RTC bus
RTC bus

హైదరాబాద్ : తెలంగాణ ఆర్‌టిసిలో కార్మికులు సమ్మె సైరన్ మ్రోగించేందుకు సిద్దమైతున్నారు. ఇప్పటికే యాజమాన్యానికి పలు సంఘాలు సమ్మె నోటీసులను అందజేశాయి. 17 సెస్టెంబర్ తర్వాత ఏక్షణంలోనైనా సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఇప్పటికే ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె నోటీసును అందజేసింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆర్‌టిసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌గా సమ్మెబాట పట్టాలని భావిస్తున్నాయి. ఇటీవల ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను మూడు మాసాలాల్లో పూర్తి చేయడంతో పాటు బస్సు సర్వీసులను కార్పొరేషన్‌గా కొనసాగించాలనే ఆ రాష్ట్ర క్యాబినేట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్‌టిసి కార్మిక సంఘాలు కూడా ఇదే తరహా డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఇదిలా ఉండగా 2013 నుంచే ఆర్‌టిసి నష్టాల బారిన నుంచి కాపాడేందుకు గాను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ కొనసాగుతుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/