అశోక్‌ను వెతికే వేటలో తెలంగాణ పోలీసులు

TS police
TS police


హైదరాబాద్‌: డేటా చోరి కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఐటి గ్రిడ్‌ కంపెనీ ఎండి అశోక్‌నుపట్టుకునేందుకు తెలంగాణ నుంచి రెండు పోలీసు బృందాలు ఏపికి బయలుదేరి వెళ్లినట్టు సమాచారం. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి నివేదిక రాగానే డేటా చోరీపై వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతుందని, అవసరమైతే ఉద్యోగులను మరోసారి విచారిస్తామని తెలంగాణ పోలీసులు అన్నారు. మరో రెండు బృందాలు హైదరాబాద్‌లో డేటాకు సంబంధించి వివరాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అశోక్‌ విజయవాడ, నెల్లూరులో తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో రెండు బృందాలు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.