అమీన్‌పూర్‌ అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్‌

నాపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందని నాటకమాడిన బాలిక

Sensational twist in Aminpur rape case
Sensational twist in Aminpur rape case

హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు పరిధిలోని అమీన్‌పూర్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ప్రచారంపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో దుకాణానికి వెళ్లిన బాలిక ఎంతసేపటికి తిరిగి రాలేదు. సాయంత్రం వేళ ఇంటికి వచ్చిన బాలికను తల్లిదండ్రులు నీలదీయగా తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణకు వచ్చిన పోలీసులకు బాలిక పొంతన లేని సమధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వైద్య పరీక్షల్లో కూడా ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. బాలికను స్థానికంగా ఉండే సందీప్‌ అనే యువకుడు సినిమాకు తీసుకెళ్లాడని తెలిసింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారన్న భయంతో బాలిక అత్యాచారం జరిగినట్లు నాటకమాడింది. దీంతో పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/