హాజీపూర్‌ కేసుల్లో శ్రీనివాస్‌ రెడ్డి దోషి

తేల్చిన నల్గొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి

Hajipur killer
Hajipur killer

నల్గొండ: హాజీపూర్‌ మూడు హత్యల కేసులో శ్రీనివాస్‌ రెడ్డి అసలు దోషి అని నల్గొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తేల్చింది. ఈ మేరకు నల్గొండలోని పోక్సో న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. కోర్టులో పోలీసులు నిందితుడిని హజరు పరచగా న్యాయమూర్తి విచారణను ప్రారంభించారు. అయితే న్యాయమూర్తి నిందితుడిని పలు ప్రశ్నలు అడిగారు. ముగ్గురుని హత్యాచారం చేసినట్లుగా నిరూపితమైందని, ఏదైనా చెప్పుకునేది ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దానికి నిందితుడు తనకు కేసులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అంతేకాకుండా తన మీద కోపంతో తన గ్రామంలో ఉన్న ఇల్లు తగలబెట్టారని, భూములు లాక్కున్నారని కోర్టు కు తెలిపాడు. తన తల్లిదండ్రులకు ఏ దిక్కు లేకుండా పోయిందని నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి న్యాయమూర్తికి తెలిపాడు. అయితే శిక్ష గురించి అడగా నిందితుడు మళ్లీ అదే సమాధానమిచ్చాడు. దీంతో భోజన విరామం అనంతరం న్యాయమూర్తి తీర్పును వెలువరించి శ్రీనివాస్‌ రెడ్డిని దోషిగా తేల్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/