మండల, జెడ్పీ పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌

telangana election commission
telangana election commission

హైదరాబాద్‌: తెలంగాణలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 7వ తేదీన ఎంపిపి, 8వ తేదీన జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు.జూన్‌ 7న ఎంపిపి ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, 8వ తేదీన జెడ్పీ ఛైర్‌పర్సన్లు, వైఎస్‌ ఛైర్‌పర్సన్లను ఎన్నుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. చేతులెత్తే పద్ధతిన జెడ్పీ, ఎంపిపి ఛైర్మన్లను, వైస్‌ఛైర్మన్‌లను ఎన్నుకుంటారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/