తెలంగాణలో నేడు తెరచుకోనున్న మద్యం షాపులు

సాయంత్రం 6 గంటల వరకూ అమ్మకాలు..భౌతిక దూరం, మాస్క్ లు తప్పనిసరని ఆదేశం

wine shop
wine shop

హైదరాబాద్‌: తెలంగాణలో నేటి నుండి మద్యం అమ్మకాలను ప్రారంభంకానున్నాయి. క్యాబినెట్‌ అనంతర సిఎం కెసిఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
బుధవారం ఉదయం 10 గంటల నుంచి షాపులను తెరుస్తామని అన్నారు. సాయంత్రం 6 గంటల వరకూ షాపులు తెరచుకోవచ్చని, షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరని, మాస్క్ లేకుంటే మద్యం విక్రయించేందుకు అనుమతి లేదని, ఈ బాధ్యత దుకాణాల యజమానులదేనని కెసిఆర్ స్పష్టం చేశారు. రెడ్ జోన్లలోనూ అమ్మకాలు కొనసాగుతాయని, కంటైన్ మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దాదాపు 15 మద్యం దుకాణాలను మాత్రం తెరిచేది లేదని వ్యాఖ్యానించారు. అయితే బార్లు,పబ్బులకు అనుమతి లేదని కెసిఆర్ అన్నారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం పెంచబోతున్నామని… మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంపు ఉంటుందని అన్నారు. వైన్ షాపుల దగ్గర భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయని… మాస్కులు ఉంటేనే షాపు యజమానులు మద్యం అమ్ముతారని సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/