తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

pocharam srinivas reddy
pocharam srinivas reddy

హైదరాబాద్‌: తెలగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈరోజు జరిగిన సమావేశాల్లో పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. సిఎం కెసిఆర్‌ బోధనా వైద్యుల వయోపరిమితి పెంపునకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు దీనికి కూడా సభ మద్దతు ప్రకటించింది. రుణ విమోచన కమిషన్‌ ఛైర్మన్‌ నియామక బిల్లుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలికల్లో వార్డుల సంఖ్యను ఖరారు చేస్తూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో తీసుకు వచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాగా సభ రేపటికి వాయిదా పడింది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/