ఎన్‌కౌంటర్లతో సమస్యలన్నీ పరిష్కారం కావు

kodandaram
kodandaram

హన్మకొండ: దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో తెజస నాయకుడు ప్రొఫెసర్‌ కోదండరాం స్పందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదని…దీని ద్వారా సమస్యలన్నీ పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో తెజస ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కోదండరాం మాట్లాడారు. ఇటీవల జరిగిన వరంగల్‌ యువతిపై జరిగిన అత్యాచార ఘటనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అత్యాచారాలు, హత్యలను ఆరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దిశ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు సత్వరమే న్యాయం చేయాలని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/