కరోనా కట్టడిలో నెంబర్‌ వన్‌ స్థానంలో తెలంగాణ

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌

gangula kamalakar
gangula kamalakar

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలకన్నా తెలంగాణలో కరోనా నివారణ చర్యలు బాగున్నాయన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని తెలిపారు. బిజెపి పాలిస్తున్న గుజరాత్‌, యూపి రాష్ట్రాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. రాజధాని డిల్లిలో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయన్నారు. ఈ సమయంలో బిజెపి నేతలు రాజకీయాలు చేయడం తగదని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/