అప్పటివరకు సచివాలయ భవనాలు కూల్చకండి

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

high court of telangana
high court of telangana

హైదరాబాద్‌: తెలంగాణలోని సచివాలయంలో భవనాల కూల్చివేతలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నూతన సచివాలయం నిర్మాణంపై కేబినెట్ తుది నమూనా నివేదికను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని కోర్టుకు అదనపు ఏజీ తెలిపారు. ఎలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు సచివాలయంలోని భవనాల కూల్చివేతపై తొందర ఎందుకు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ సచివాలయంలోని భవనాలను కూల్చవద్దని ఆదేశాలు జారీ చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/