తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కార్పొరేషన్ పదవులను ఆఫీసు ఆఫ్ ప్రాఫీట్ పరిధి నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం మేరకు ఆర్డినెన్స్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. జీతాలు, పెన్షన్ చెల్లింపులు, అనర్హత తొలగింపు చట్ట సవరణ కూడా చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. గతంలో ఒక ప్రజాప్రతినిధి మరో లాభదాయమైన పదవి చేపడితే వారిని అనర్హులుగా ప్రకటించేందుకు వీలుంది. కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఇకపై ఒక ప్రజాప్రతినిధి రెండు పదవులను నిర్వహించవచ్చు. రెండు చోట్లా జీతం, భత్యం, ఇతర ఆర్థికపరమైన లాభాలను కూడా పొందడానికి అవకాశం లభించనుంది. టిఆర్ఎస్ పార్టీలో ఎవ్మెల్యెలు, ఎమ్మెల్సీలకు వివిధ కార్పొరేషన్ పదవులను అప్పగించాలని సీఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి చైర్మన్గా నియమించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/