ఢిల్లీ పర్యటనలో తెలంగాణ గవర్నర్‌

Tamilisai soundararajan-Ram Nath Kovind
Tamilisai soundararajan-Ram Nath Kovind

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ కానున్నారు. హర్యానాలో జరిగే గవర్నర్ల ఉపసంఘం సమావేశంలో తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొననున్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం గవర్నర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/