జిల్లాల పాలనలో నూతన పద్ధతి

ప్రతి జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించనున్న తెలంగాణ ప్రభ్తుత్వం

Telangana
Telangana

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాయింట్‌ కలెక్టర్‌ పోస్టులను రద్దు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 49 మంది నాన్‌కేడర్, కేడర్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సుకు రెండు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును రద్దు చేసి, ఆ స్థానంలో అడిషనల్ కలెక్టర్‌ పోస్టును సృష్టించింది. జిల్లా స్థాయిలో రెవెన్యూ చట్టం అమలు, భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్‌ కలెక్టర్ పోస్టు రద్దు ద్వారా రెవెన్యూ శాఖలో సంస్కరణలకు తెంగాణ ప్రభుత్వం ఊతమిచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా 49మంది అధికారులను బదిలీ చేయడంతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఐఏఎస్‌ కేడర్‌తో పాటు నాన్‌కేడర్‌ అధికారులను అదనపు కలెక్టర్‌ పోస్టుల్లో నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాయింట్‌ కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించింది. చాలా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను అదే జిల్లాకు అదనపు కలెక్టర్లుగా బదిలీ చేసింది. కొన్ని జిల్లాలకు కొత్త అధికారులను అదనపు కలెక్టర్లుగా, అలాగే 14 జిల్లాలకు వేరే అధికారులను అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)గా నియమించింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/