ప్రగతి పథంలో తెలంగాణ

ముఖ్యమంత్రి కేసీఆర్‌

Telangana Formaton Day Celebrations
TS CM KCR

Hyderabad: తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌ గార్డెన్‌లో జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఐదేళ్లలో ఎన్నో అవరోధాలు అధిగమించామని, ఎన్నో విజయాలు సాధించామన్నారు. తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తోందన్నారు. ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేళ్లు చాలా చిన్నకాలమన్నారు. అనేక అపనమ్మకాలు, అనుమానాల మధ్య రాష్ట్రం ఏర్పడిందన్నారు. అనతి కాలంలోనే వాటన్నింటినీ పటాపంచలు చేసిందన్నారు. ప్రజలు మాపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తూ పునర్‌ నిర్మాణానికి నడుం బిగించామన్నారు. ప్రభుత్వం పని తీరును ప్రజలు మెచ్చి తమ గుండెల్లో పెట్టుకున్నారని, దానికి గత అసెంబ్లిd ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయన్నారు.
గడిచిన ఐదేళ్లలో తెలంగాణ 16.5 శాతం ఆదాయ వృద్ధిరేటు సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌ గార్డెన్‌లో జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. అతి తక్కువ కాలంలో విద్యుత్‌ సమస్యను అధిగమించామన్నారు. వ్యవసాయంతో సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మిషన్‌ భగీరథ ప్రజలకు నీళ్ల బాధల నుంచి విముక్తి కల్పించిందన్నారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావొచ్చాయన్నారు. జులై నాటికి గ్రామాలలో 100 శాతం మిషన్‌ భగీరథ పనులు పూర్తవుతాయన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు తన మానస పుత్రికలు అన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. వ్యవసాయ అనుబంధ వృత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకానికి విత్తనాలు ఇచ్చామన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం సఫలమైందన్నారు. బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్‌, రంజాన్‌లను రాష్ట్ర పండుగలుగా గుర్తించామన్నారు. ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్‌లో నిర్మిస్తామన్నారు.
పెంచిన పింఛన్లు జులై నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. కళ్యాణలక్ష్మి పథకానికి వచ్చిన ఆశీస్సులే ప్రభుత్వానికి పెట్టని కోటలు అన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న మన పథకాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందన్నారు. మన పథకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. పథకాలు రైతులకు కొండంత ధైర్యాన్నిస్తున్నాయన్నారు. తెలంగాణలో క్రాఫ్‌ కాలనీలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు.

రాష్ట్రంలో రెవెన్యూ చట్టాన్ని ప్రక్షాళన చేయబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. కొత్త రెవెన్యూ చట్టం రూపొందించబోతున్నామన్నారు. కొత్త రెవెన్యూ చట్టం అమలుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. అవినీతికి అడ్డుకట్టలు వేస్తూ పారదర్శక పాలనలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలన్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. భవిష్యత్‌లో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఉండదన్నారు.