అమరవీరులకు నివాళులు

Telangana formation day celebrations
TS CM KCR

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమరవీరులకు నివాళులర్పించారు. గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. రాష్ట్ర గమనం, అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రణాళికలు, ప్రాధాన్యాలను సీఎం వివరించనున్నారు.