అచ్చు మెట్రోలానే ఆకాశంలో బస్సు మార్గం

సాఫీ ప్రయాణం కోసం ప్రణాళిక

Air Bus
Air Bus

హైదరాబాద్‌: మెట్రోరైలు ఆకాశమార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చకచకా సాగిపోతుంది. అచ్చం మెట్రోలానే నిరాటంకంగా సాగేలా తక్కువ ఖర్చుతో ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌(ఈబిఆర్‌టిఎస్‌) ఆకాశ బస్సు మార్గాన్ని పట్టాలెక్కించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. కేపిహెచ్‌బి నుంచి మెట్రోస్టేషన్‌ నుంచి జెఎన్‌టియూ మీదుగా హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వరకు ఆకాశ బస్సు మార్గాన్ని పూర్తి గా ప్రైవేటు నిధులతో నిర్మించనున్నారు. దాదాపు రూ. 2600 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. ఇప్పటికే పలువురు పెట్టుబడి పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేశారని మెట్రో వర్గాలు తెలిపాయి. మూడు నెలల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌) రాగానే ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇటీవల డిపిఆర్‌ తయారీకి హైదరాబాద్‌ మెట్రో లిమిటెడ్‌ టెండర్లకు ఆహ్వానించింది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos