పొత్తూరి మృతి పట్ల సంతాపం తెలిపిన కెసిఆర్‌

Potturi Venkateswara Rao and CM KCR
Potturi Venkateswara Rao and CM KCR

హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పత్రికా, సామాజికరంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను సిఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి అందించిన నైతిక మద్దతును కెసిఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/