నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న తెలంగాణ కేబినెట్

cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ మరికాసేపట్లో సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసుల అంశంపై కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త సచివాలయం భవన సముదాయం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనున్నారు. ఈ డిజైన్‌కు మెరుగులు దిద్ది తుదిరూపు ఇచ్చేందుకు గత రెండు వారాలుగా సిఎం కెసిఆర్ కసరత్తు నిర్వహించారు. రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో సచివాలయం భవనాన్ని నిర్మించాలని సిఎం యోచిస్తున్నారు ఇక కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసుల అంశంపై కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో విద్యా సంస్థలను తెరవడం ఏ మాత్రం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్య, డిజిటల్‌ బోధన తరగతులు ప్రారంభించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యార్థులకు డీడీ యాదగిరి, టీ–శాట్‌ చానళ్ల ద్వారా వీడియో పాఠాలను ప్రసారం చేసే అంశంపై కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/