కేసిఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ సియం కేసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమయింది. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ భేటికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో పాటు రెవిన్యూ చట్టంలో మార్పులు, చేర్పులు, పురపాలక చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టానికి ఆమోదముద్రతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నూతన సచివాలయ భవన నిర్మాణం ప్లాన్‌, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు చెక్‌పవర్‌ ఇవ్వాలన్న నిర్ణయానికి ఆమోదం తెలపడంతో పాటు పలు ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదముద్ర వేయనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/