రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ బిజెపి నేతలు

BJP party
BJP party

న్యూఢిల్లీ: తెలంగాణ బిజెపి నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా బిజెపి నేత లక్ష్మణ్‌ మాట్లాడారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్రపతి కోవింద్‌ దృష్టికి తీసుకెళ్ళామని లక్ష్మణ్‌ చెప్పారు. ఇంటర్ పరీక్షలకు 9 లక్షల మంది హాజరైతే 3 లక్షల మంది ఫెయిల్‌ అయ్యారని, 27 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్లే విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/