తెలంగాణలో ఈ 25న ఆటోల బంద్‌

auto bandh
auto bandh

హైదరాబాద్‌: ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న రాష్ట్రవ్యాప్త ఆటో బంద్‌కు ఆటోడ్రైవర్స్‌ జేఏసి పిలుపునిచ్చింది. గత నెలలో హత్యకు గురైన అటోడ్రైవర్‌ సాయినాథ్‌ కుటుంబాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆటోడ్రైవర్స్‌ జేఏసి కన్వీనర్‌ మహ్మద్‌ అమానుల్లాఖాన్‌ అన్నారు. మద్యం మత్తులో సాయినాథ్‌ను హత్య చేయడంతోపాటు పెట్రోల్‌ పోసి ఆటోను ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆటోడ్రైవర్లు తమవంతుగా సాయినాథ్‌ కుటుంబం ఫ్యామిలీ ఫండ్‌ పేరుతో చందాలు వసూలు చేసి ఈ నెల 25న ఆయన కుటుంబానికి అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/