తెలంగాణ అసెంబ్లీ శనివారానికి వాయిదా

pocharam srinivas reddy
pocharam srinivas reddy

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీలో కేసీఆర్‌, మండలిలో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దేశ వ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గిందని కేసీఆర్ చెప్పారు. వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చించనున్నారు.