ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana Legislative Assembly
Telangana Assembly

హైదరాబాద్‌: స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉదయం 11.30 గంటలకు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలుకావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లుల‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. బిల్లులకు ఇప్పటికే మంత్రి మండలి ఆమోద ముద్రవేసింది. భూముల ధర నిర్ధారణకు సంబంధించి సబ్‌ రిజిస్ట్రార్లకు 47ఏ కింద ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేస్తూ ఇండియన్‌ స్టాంప్‌ చట్టానికి సవరణను రాష్ట్ర ప్రభుత్వం సవరణ సిఎం కెసిఆర్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవస్యాయ భూముల్ని వ్యవసాయేతరులుగా బదలాయించే ప్రక్రియలో అధికారులకు విచక్షణాధికారాలు లేకుండా ‘ధరణి’ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునేలా చట్ట సవరణను సిఎం ప్రవేశపెడుతారు. పలు కీలక సవరణకు ఉద్దేశించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్ట సవరణ బిల్లును పురపాలక శాఖ మంత్రికెటిఆర్‌ ప్రవేశపెట్టనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/