బడ్జెట్‌…ఎమ్మెల్యెకు రూ. 3 కోట్లు: హరీశ్‌ రావు

telangana assembly budget session 2020. Harish Rao
telangana assembly budget session 2020. Harish Rao

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమాయ్యాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. అందులో ప్రత్యేకంగా ఒక్కొక్క నియోజకవర్గం ఎమ్మెల్యెకు రూ. 3 కోట్ల చొప్పున కేటాయింపులు జరుపనున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హరీశ్ రావు తెలిపారు. ఖఖఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ. 3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధి ఇవ్వనున్నాం. వాటి వినియోగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిధుల కోసం మొత్తంగా రూ. 480 కోట్లను బడ్జెట్ లో కేటాయిస్తున్నాం..చ అని వివరించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/