తమిళి సై గవర్నర్‌గా ప్రమాణం

tamilisai-soundararajan-cm kcr
tamilisai-soundararajan-cm kcr


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కొత్త గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె రాష్ట్ర రెండో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమ అనంతరం సిఎం కెసిఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన తండ్రికి గవర్నర్ తమిళిసై పాదాభివందనం చేశారు. తమిళిసై సొంత రాష్ట్రం తమిళనాడు. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై ఆనతి కాలంలోనే అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, హరీశ్‌రావు, కెటిఆర్, ఎంపి సంతోష్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తమిళనాడు డిప్యూటీ సిఎం పన్నీరుసెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి, సిఎస్ ఎస్‌కె జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.