శ్రీవారిని దర్శించుకున్న తలసాని

Talasani Srinivas Yadav - Tirumala
Talasani Srinivas Yadav – Tirumala

తిరుమల: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులచే ఆశీర్వచనం ,శ్రీవారి శేష వస్త్రాలు, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. ఎపిలో మంచి పరిపాలన దక్షుడు జగన్ ను ప్రజలు ఎన్నుకున్నారని, ఎపి, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి ఇరు రాష్ట్రాల సిఎంలు జగన్, కెసిఆర్ అంకితభావంతో పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇద్దరు సిఎంలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తలసాని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/