ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు

అధికారంలో ఉన్నట్లుగా భావించి కాంగ్రెస్‌ మేనిఫెస్టోను తయారు చేసిందని మంత్రి ఎద్దేవా

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్‌: నగరపాలికలు, మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుందని..టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పశుసంర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నట్లుగా భావించి కాంగ్రెస్‌ మేనిఫెస్టోను తయారు చేసిందని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బిజెపిలకు చెప్పుకోవడానికి ఏం లేవని.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పూర్తి స్థాయిలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. ఇంకా తాండూరు మున్పిపాలిటీని ఎంఐఎం పార్టీకి ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని…అలా చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. మజ్లిస్‌ పార్టీతో టిఆర్‌ఎస్‌కు కేవలం అవగాహన మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీది పరిమితమైన పాత్ర మాత్రమేనని తలసాని చెప్పారు. మజ్లిస్‌ పొటీచేసిన చోట బిజెపి ఎందుకు పోటీ చేయడంలేదని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/