భారీ ర్యాలీతో సాయికిర‌ణ్ నామినేష‌న్‌

talasani sai kiran
talasani sai kiran

హైదరాబాద్: సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి సాయికిరణ్ నామినేషన్ వేసేందుకు బయలు దేరారు. భారీ ర్యాలీగా సాయికిరణ్ బయలుదేరారు. నామినేషన్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇంట్లో నానమ్మ, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న సాయికిరణ్.. అక్కడి నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి నామినేషన్ వేయడానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, దానం నాగేందర్, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.