ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పద మృతి

ఒక్కో గదిలో ఒక్కొక్కరి మృతదేహం

Women commit sucide
man-died

వనపర్తి: తెలంగాణలోని వనపర్తి జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వారి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పలు వివరాలు తెలుసుకున్నారు. మృతులను ఆజీరాం బీ(63,) ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా(10)గా గుర్తించారు. వారి ఇంట్లోని వంట గదిలో అజీరాం బీ మృతదేహం ఉండగా, డైనింగ్‌ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక ఖాజా పాషా, హాలులో హసీనా మృతదేహాలు కనపడ్డాయి. వారింట్లో క్షుద్రపూజలు చేసినట్లుగా కొన్ని గుర్తులు కనపడ్డాయి. ఖాజా పాషా మృతదేహం పక్కన కొబ్బరికాయ, నిమ్మకాయలు ఉండడంతో పాటు అక్కడే ఓ గొయ్యి ఉంది. వీరిని ఎవరైనా హత్య చేరారా? లేక వారంతా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/