సిద్ధిపేటలోని కోమటి చెరువుపై వ్రేలాడే వంతెన!

కోమటి చెరవును పరిశీలించిన హరీశ్‌రావు

suspension bridge
suspension bridge

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్న సిద్దిపేటలోని కోమటి చెరువుపై లక్నవరం తరహాలో సస్పెన్షన్‌ బ్రిడ్జి( వ్రేలాడే వంతెన) ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఆయన ఈ రోజు కోమటి చెరువును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..లక్నవరం మాదిరిగా వ్రేలాడే వంతెన ఏర్పాటు చేస్తున్నట్లు , కొద్దిరోజుల్లోనే కోమటి చెరువుకు కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయని, కోమటి చెరువుని ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపడతామన్నారు. కోమటి చెరువుపై ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇరిగేషన్‌, టూరిజం, మున్సిపల్‌ అధికారులకు సూచించారు. అతి త్వరలో పనులు మొదలుపెట్టి రెండు, మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/