రాజన్న సిరిసిల్లలో మరో విద్యార్థిని ఆత్మహత్య

suicide
suicide

కరీంనగర్: తెలంగాణ ఇంటర్ ఫలితాల అనంతరం పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని పలువురు విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుమారు 23 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ బోర్డు వ్యవహారంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన కామిండ్ల లావణ్య అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.

తాజా ఎన్నారై వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/nri/