రక్షణ కల్పించాలంటూ ఓయూలో విద్యార్థినుల ధర్నా

Osmania University
Osmania University

హైదరాబాద్‌: ఉస్మానియా ఇంజినీరింగ్‌ విద్యార్థినుల హాస్టల్‌లో గురువారం తెల్లవారుజామున ఆగంతుకుడు హల్‌చల్‌ చేశాడు. హాస్టల్‌లోకి దూరి కత్తితో ఓ విద్యార్థినిని బెదిరించాడు. మిగతా విద్యార్థినులు గట్టిగా అరవడంతో మొదటి అంతస్తు నుంచి దూకి పరారయ్యాడు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషయపై విశ్వవిద్యాలయ వసతి గృహంలో తమకు రక్షణ కల్పించాలంటూ ఉస్మానియా విద్యార్థినులు ధర్నాకు దిగారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఇవాళ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలంటూ రోడ్డుపై బైఠాయించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/